శరద్ పవార్ అధ్యక్షతన విపక్షాల భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు ఢిల్లీలో శరద్ పవార్, యశ్వంత్ సిన్హా అధ్యక్షతన దేశంలోని 15 విపక్ష పార్టీలు భేటీ కానున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితుల పట్ల, రానున్న ఎన్నికల్లో విపక్ష పార్టీల పాత్ర వంటి అంశాలపై భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్, యశ్వంత్ సిన్హా దేశంలోని 15 పార్టీలకు లేఖల ద్వారా ఆహ్వానాన్ని పంపారు.

త్వరలో కొన్ని రాష్ట్రల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ఎదుర్కునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిశోర్ శరద్ పవార్‌తో రెండు మూడు సార్లు సమావేశమయ్యారు. వీరి భేటీ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఇక వీరి కలయిక దేశ రాజకీయాల్లో మార్పులు తెచ్చే దిశగా జరుగుతుందంటూ తీవ్ర దుమారం రేగుతోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మోడీని ఎదుర్కోవటానికి గట్టుదిట్టమైన ప్రణాళికలో ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక నేటి భేటీలో ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో అని ఎదురుచూస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: