శశికళతో మాట్లాడారని..మరీ దారుణం

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళనాడు రాజకీయాల్లో శశికళ పేరు మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ మధ్య జైలు నుంచి విడుదలైన నాటి నుంచి కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారు. ఇక ఆమె ఉన్నట్టుండి రాజకీయాల్లోకి మళ్లీ రావాల్సిన సమయం వచ్చిందని కొందరు అన్నాడీఎంకే నేతలతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆడియోలు బయటపడ్డాయి. దీంతో ఆ పార్టీ అధిష్ఠానం శశికళతో మాట్లాడిన దాదాపుగా 17 మంది నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఇక తాజాగా అన్నాడీఎంకే ఎంజీఆర్‌ యువజన విభాగం కార్యదర్శిగా కొన్నాళ్లు పనిచేసిన విన్సెంట్‌ రాజాతో శశికళ ఇటీవల మాట్లాడారు. ఈ ఆడియా సోషల్ మీడియాల్లో వైరలైంది. దీంతో అన్నాడీఎంకే అధిష్టానం విన్సెంట్‌ రాజాను పార్టీ నుంచి బహిష్కరించి ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది. దీంతో అగ్రహించిన అన్నాడీఎంకే పార్టీలోని కొందరి నేతల సహకారంతో గుర్తు తెలియని దుండగులు విన్సెంట్‌ రాజా కారును పెట్రోలు పోసి తగలబెట్టారట. ఈ సంఘటన రామనాథపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: