నిర్మాత సురేష్‌ బాబుకి టోకరా

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడు బడా నిర్మాత సురేష్ బాబుని బురిడీ కొట్టించాడు ఓ యువకుడు. టీకా డోసులు ఉన్నాయని చెప్పి మోసగించాడు. 10 రోజుల క్రితం నాగార్జున రెడ్డి అనే యువకుడు సురేష్ బాబుకు ఫోన్ చేశాడు. నేను కేటీఆర్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని, నా దగ్గర 500 టీకా డోసులు ఉన్నాయని మీకు కావాలంటే పంపుతానని చెప్ప బలికాడు.

దీంతో నిజమేనని నమ్మిన సురేష్ బాబు రూ.1 లక్ష నగదును నాగార్జున రెడ్డి భార్య ఖాతాకు పంపాడు. ఆ తర్వాత సురేష్ బాబు నుంచి ఫోన్ వెళ్లగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఖంగుతిన్న సురేష్ బాబు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: