వేడెక్కిన మా రాజకీయం

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తుంటే రాజకీయ పార్టీలకు కాస్త వేడి రాజుకుంటుంది. కానీ టాలీవుడ్‌లో జరగబోయే ప్రతిష్ఠాత్మక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మాత్రం రాజకీయ ఎన్నికల వేడిని తలపిస్తోంది. ఇటీవల ప్రకాష్‌ రాజ్ పోటీలో నిలవబోతున్నానని చెప్పాడో లేదో వెంటనే మంచు విష్ణు కూడా పోటీలోకి దిగుతున్నానని ప్రకటించాడు. ఇక వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా జరగనుందని తెలుస్తోంది.

మా ఎన్నికల్లో రాజకీయ రంగు కూడా పులుముకోనున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ అండగా ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఈ మధ్య కాలం నుంచి స్నేహపూరిత వాతావరణం చిగురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా ప్రకాష్‌ రాజ్‌కి సపోర్ట్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా మంచు విష్ణుకు మాత్రి ఏకంగా ఏపీ సీఎం అండగా ఉన్నారని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో మంచు ఫ్యామిలీ నుంచి మెహన్ బాబు బహిరంగంగా మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ వర్గం నుంచి కూడా మా ఎన్నికల్లో మంచు విష్ణుకు మద్దతు ఉంటుందని తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: