వైపీపీ సర్కార్‌పై చిరు ప్రశంసలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. నిన్న ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను రికార్డు స్థాయిలో జరపటం పట్ల ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో ఆరోగ్య అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనటం పట్ల అద్భుతమైన ఫిట్ సాధించారని తెలిపారు. ప్రతీ ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతూ జగన్ పాలన స్ఫూర్తివంతమైన నాయకత్వానికి నిదర్శనమని అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: