కంట్లో వేసే మందు ప్రమాదమే

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో ఆనందయ్య మందు గురించి ఎంత అల్లరి జరిగిందో అందరికి తెలిసిందే. ఇటీవల ప్రభుత్వం నుంచే కాకుండా హైకోర్టు నుంచి కూడా అనుమతులు రావటంతో మందు పంపిణీకి అడ్డంకులు తొలిగిపోయాయి. అయితే కంట్లో వేసే మందుపై హైకోర్టులో విచారణ జరిగింది.

దీంతో ప్రభుత్వ తరుపు లాయర్ చుక్కల మందు కంటే కంటిలో వేసే మందు వల్ల కంటికి కొంత ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, ల్యాబ్‌లలో పరీక్షలు జరిపామన్నారు. ఈ పరీక్షలో కంటికి హనీ కలిగే అవకాశాలు చాలా తేలాయని ప్రభుత్వ తరపు లాయర్ న్యాయమూర్తికి వెల్లడించారు. కాగా ఆ లాబ్ రిపోర్టును మా ముందు ఉంచాలని న్యాయస్థానం తెలిపింది. కేసును జూలై ఒకటికి వాయిదా వేశారు

 

Share.

Comments are closed.

%d bloggers like this: