థర్డ్ ఫ్రంట్‌తో బీజేపీని ఓడించలేరు-ప్రశాంత్ కిశోర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రశాంత్ కిశోర్..దేశ రాజకీయాల్లో అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్ధి ఎంతటి వాడైన సరే ఆయన వ్యూహాల ముందు తలవంచాల్సిందే. తన వ్యూహాలతో ప్రత్యర్ధి పార్టీలను గెలుపు గుమ్మం దగ్గరకి రానివ్వకుండా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటు దేశ రాజకీయాల్లో తన మార్క్‌తో దూసుకెళుతున్నాడు ప్రశాంత్ కిశోర్. ఇటీవల కాలంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహాలతో రెండు పార్టీలకు గెలుపును అందించాడు.

ఇక దీనితో నేను పూర్తిగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పినట్టే చెప్పి మళ్లీ వరుసగా కొన్ని పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో రెండు మూడు సార్లు భేటీ అయ్యారు. ఈ భేటీ ఎందుకు జరిగిందన్నసమాధానం మాత్రం ఎవరి దగ్గర లేదనే చెప్పాలి. అనంతరం ఓ మీడియాతో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీనీ ఓడించాలంటే థర్డ్ ఫ్రంట్‌తో సాధ్యం కాదని తేల్చిచెప్పారు. నాకు థర్డ్ ఫ్రంట్‌కు సంభందమే లేదన్నారు.

ఇక నేడు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా అధ్యక్షతన 15 పార్టీలతో సమావేశం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలు ముందు ముందు ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: