కరోనాను ఎదుర్కోవటంలో కేంద్రం విఫలమైంది-రాహుల్

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలోని మరిన్ని కరోనా వేవ్‌లు రావచ్చిని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మొదటి, రెండవ దశ కరోనా వల్ల దేశం చాలా విపత్కర పరిస్థితిలోకి వెళ్లిపోయిందని, ఇక రానున్న థర్డ్ వేవ్ పట్ల ముందు జాగ్రత్తతో చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.

మంగళవారం కోవిడ్-19 పై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు రాహుల్ గాంధీ. ఈ శ్వేత పత్రాన్ని నిపుణులతో చర్చించి రూపొందించామన్నారు. ఇందులోని అంశాలు థర్డ్ వేవ్‌కు ఉపకరిస్తాయని తెలిపారు. ఇక థర్డ్ రాబోతుందని యావత్త్ దేశ ప్రజల మొత్తానికి తెలుసన్నారు. ముందే గ్రహించి ఆస్పత్రులు, బెడ్స్, ఆక్సిజన్ ఇలా అవసరమైన వాటన్నిటిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: