పట్టాలెక్కిన ఎంఎంటీఎస్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా సంవత్సరానికి పైగా నిలిచిపోయిన రైళ్లు నేటి నుంచి పరుగులు పెట్టనున్నాయి. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్లను పున:ప్రారంభించాలని ప్రకటించారు. ప్రస్తుతం 10 రైళ్లను ప్రారంభించాలని తెలిపారు.

అనంతరం కరోనా ప్రభావాన్ని బట్టి మరిన్ని రైళ్లను నడపనున్నామన్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణికుల గమ్యానికి చేర్చే ఎంఎంటీఎస్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. దాదాపు 15 నెలలుగా నిలిచిపోయిన సర్వీసులు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు. ఇక ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: