ఎవరికి ఇచ్చినా ఓకే-జగ్గారెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

టీపీసీసీ పదవి ఎంపికపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. పీసీసీ పదవి ఎవరికి ఇచ్చినా అందరం కలుపుకుని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చే దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని ఎద్దేవ చేశారు జగ్గారెడ్డి.

Share.

Comments are closed.

%d bloggers like this: