ఓటీటీలో మాస్ట్రో మూవీ?

Google+ Pinterest LinkedIn Tumblr +

నితిన్ హీరోగా మెర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్ట్రో. శ్రేష్ట్‌మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా, నభానటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మొదటగా ఈ నెల 11న విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా పరిస్థితుల వల్ల విడుదలను వాయిదా వేసుకున్నారు చిత్ర యూనిట్. ఇక ఇప్పట్లో థియేటర్లలో మూవీని విడుదల చేయటం కష్టమని భావించిన నిర్మాతలు ఓటీటీ ద్వారా విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: