సిని “మా”లో గెలిచేదెవరు?

Google+ Pinterest LinkedIn Tumblr +

త్వరలో జరగనున్న మా ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రసవత్తర పోటీ నెలకొంది. ఇటీవల ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా ఎన్నికల భరిలోకి దిగుతున్నామని ప్రకటించగా తాజాగా జీవిత రాజశేఖర్ రంగంలోకి దిగింది. దీంతో మా ఎన్నికలు కాస్త త్రిముఖ పోటీని తలపిస్తోంది. ఉన్నట్టుండి రంగంలోకి వచ్చిన జీవిత వారికి పోటీగా నిలవనుందని తెలుస్తోంది.

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ ఎన్నికల్లో ఎవరి వర్గాలు వారికి అండగా నిలవనున్నాయి. ప్రకాష్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ అండగా నిలుస్తుందని ఓ వైపు వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇక మంచు విష్ణుకు కూడా ఆయనకు కొందరు మద్ధతుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లో మా ఎన్నికలు రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. దీంతో పాటు మా ఎన్నికలు రాజకీయ రంగును పులుముకునే అవకాశం కనిపిస్తోంది.

మంచు విష్ణుకు వైఎస్ జగన్‌కు మంచి సంబంధాలున్నయన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ రకంగా ఆయన వర్గం నటులు మంచు విష్ణుకు మద్దతుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏదేమైనా సిని మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని తలలు పండిన మేదావులు సైతం చర్చించుకుంటున్నారట.

Share.

Comments are closed.

%d bloggers like this: