పార్ట్‌-2 గా సలార్‌ ?

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత నీల్. ఇక ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది శృతిహాసన్‌. ఈ ఏడాది జనవరిలో చిత్ర షూటింగ్ ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా మూవీ షూటింగ్ అర్ధంతరంగా వాయిదా పడింది.

ఇక విషయానికొస్తే ఈ మధ్య అన్ని చిత్ర పరిశ్రమల్లో ఏదైన సినిమా బంపర్ హిట్ సాధిస్తే చాలు దానికి సీక్వెల్‌గా మరో పార్ట్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు దర్శకులు. సలార్ మూవీ గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని కూడా పార్ఠ్‌-2 తెరకెక్కిచేందకు ప్రయత్నాలు చేస్తున్నారట దర్శక, నిర్మాతలు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: