కేసీఆర్ మోసం, కుట్రలను నమ్ముకున్నారు-ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజురాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గొప్ప గొప్ప పార్టీలు ప్రజలను, వ్యవస్థలను నమ్ముకుంటాయని, కేసీఆర్ మాత్రం మోసం, కుట్రలను నమ్ముకున్నారని ఫైర్ అయ్యారు.

త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆయనకు చరమగీతం పాడతారన్నారు. ఇక కేసీఆర్ ఆయన రాసిన రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు పరుస్తున్నారని ఎద్దేవ చేశారు. ఇక భూ కబ్జా ఆరోపణలతో ఈటల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: