అల్లుడు”హీరో”గా ఎంట్రీ..మామ మహేష్ టీజర్ లాంచ్

Google+ Pinterest LinkedIn Tumblr +

గల్లా జయదేవ్ తనయుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక మొత్తానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హీరో అనే టైటిల్‌ను పెట్టారు చిత్ర యూనిట్. ఈ సినిమాను గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశాడు మహేష్ బాబు. “అశోక్ నీ ఫస్ట్ సినిమా టైటిల్ ను లాంచ్ చేయడం కంటే సంతోషకరమైన విషయం మరొకటి లేదు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘హీరో’ ప్రయాణం ప్రారంభమైంది” అంటూ ట్వీట్ చేశాడు మహేశ్ బాబు.ఇక తాజాగా విడుదల చేసిన మూవీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: