చిరు ట్వీట్‌కు సీఎం సాబ్ రిప్లై

Google+ Pinterest LinkedIn Tumblr +

మంగళవారం ఏపీ ప్రభుత్వంపై జూన్ 20న ఏపీలో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందిస్తూ చిరుకి ట్విట్టర్ లో సమాధానం ఇచ్చారు.

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అందరి సహకారంతో జరుగుతుందన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ఆశావర్కర్లు, ఏఎన్ఎం, మండల వైద్యాధికారుల సహకారంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను రికార్డ్ స్థాయిలో చేయగలిగామని తెలిపారు సీఎం.ఇక రోజు రోజుకు ఏపీలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: