పెద్ద మనసు చాటుకున్న బిగ్‌ బి

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా రాకతో ప్రపంచమంతా అల్లకల్లోం అవుతుండటంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులు కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్, చిరంజీవి వంటి ప్రముఖ నటులు కరోనా బాధితులకు ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలు అందిస్తూ పెద్దమనుసు చాటుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక బాలీవుడ్ అంతా బిగ్‌ బి అని పిలుచుకునే అమితాబ్‌ తన సహాయంతో మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా బాధితులకు అండగా నిలుస్తూ పలు దానాలు చేశారు. తాజాగా సుమారు రూ.1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్‌లో గల లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రికి అందజేశారు. గతంలో ఆయనకు కరోనా సోకగా తిరిగి కోలుకున్నాడు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: