చిరుకి హీరోయిన్ గా సోనాక్షి?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి..తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నాళ్ల గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ జోరును పెంచుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా అనే తమిళ దర్శకుడితో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్.

అనంతరం టాలీవుడ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే సినిమాలో చిరుకు జోడిగా సోనాక్షి సిన్హా నటిస్తుందంటూ వార్తలు జోరందుకున్నాయి. చిత్ర యూనిట్ సోనాక్షిని సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాక తప్పదు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: