విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?-లోకేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

పరీక్షల నిర్వహణ విషయమై ఇటీవల సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ను దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో పరీక్షలను నిర్విహిస్తామని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల పట్ల చొరవ తీసుకుంటామని తెలిపింది ప్రభుత్వం. ఇక తాజాగా ఇదే అంశంపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కోర్టుకు ప్రణాళిక లేని అఫిడవిట్ ను పంపిందన్నారు లోకేష్.

ఒక వేళ పరీక్షలు నిర్వహించాలనుకుంటే 35 వేల తరగతులను సిద్దం చేశారా అంటూ ప్రశ్నించారు. కోర్టు మొట్టికాయలు వేసినా బుద్ది మార్చుకోరంటూ ధ్వజమెత్తారు. విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా అని అన్నారు. ఇక విద్యార్థుల ప్రాణాలకు ఏమైనా జరిగితే వారికి పరిహారంగా రూ.1 కోటి ఇవ్వాలని కోర్టు తెలపటంతో వారి ప్రవర్తన తీరును అద్దం పడుతుందని అన్నారు లోకేష్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: