తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ హైకోర్టు

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ సర్కార్ విద్యాసంస్థలను తెరిచేందుకు నిర్ణయాన్ని తీసుకుంది. జూలై 1 నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల తెరిచేందుకు సిద్దమైన ప్రభుత్వ తీరుపై అగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.

కోవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్న క్రమంలోనే అనాలోచిత, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని హెచ్చిరించింది. ఎలాంటి మార్గదర్శక నిర్ణయాలు రూపొందించకుండా బడులు ఎలా తేరుస్తారంటూ మండిపడింది. విద్యాసంస్థలను ప్రారంభించాలనుకుటున్న సర్కార్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది తిరుమలరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: