నేడు కేటీఆర్ ఇలాకాలో వైఎస్ షర్మిల పర్యటన

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో దూకుడు మీదున్న వైఎస్ షర్మిల నేడు కేటీఆర్ ఇలాక అయిన సిరిసిల్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పార్టీ యూత్ లీడర్ అయిన విక్రమ్ రెడ్డిని ఆమె పరామర్శించనున్నారు. అనంతరం, అల్మాస్ పూర్ లో ఇటీవల కరోనాకు బలైన కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు.

షర్మిల పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక షర్మిల పార్టీ ప్రకటనను వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించనున్నారు. వైఎస్ జయంతి రోజున పార్టీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పార్టీ ఏర్పాటులో దూకుడు పెంచిన షర్మిల తెలంగాణ సమస్యలపై కూడా ప్రశ్నిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: