కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ లేఖలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని చేసుకుంటు నీటిని దిగువనకు వదిలేస్తుందని తెలిపింది.

ఇలాగైతే పోతిరెడ్డి పాడు నుంచి మేము నీటిని ఎలా తీసుకెళ్లాలని లేఖలో తెలిపింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను అక్రమంగా నిర్మిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: