కళాకారులు లోకల్ కాదు.. యూనివర్శల్-ప్రకాశ్ రాజ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ ప్రకాశ్ రాజ్ హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న గురువారం ఏకంగా 27 మందితో కూడిన ప్యానెల్‌ ను కూడా విడుదల చేశారు ప్రకాష్‌రాజ్. తాజాగా దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రకాశ్ రాజ్.లోకల్, నాన్ లోకల్ అని కొందరు విమర్శిస్తున్నారని, అవార్డులు తీసుకున్నప్పుడు, గ్రామాలను దత్తత్త తీసుకున్నప్పుడు నాన్ లోకల్ ప్రస్తావన ఎందుకు రాలేదంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

ఇక ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని, చాలా కాలం పాటు గ్రౌండ్ వర్క్ చేశామన్నారు. మా అధ్యక్ష పోటీ వెనుక చాలా మథనం ఉందని, మా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షలుగా పని చేసినవారున్నారని తెలిపారు. కళాకారులు లోకల్ కాదు…యూనివర్శిల్ అంటూ తెలిపారు. ఇక త్వరలో ఎన్నికల తేదీని ప్రకటించాలని కోరారు ప్రకాశ్ రాజ్.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: