లారెన్స్ ‘అధికారమ్’ మూవీ ఫస్ట్ లుక్

Google+ Pinterest LinkedIn Tumblr +

రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫితోనే కాకుండా ఇటు నటనతో, అటు దర్శకత్వ ప్రతిభతో అన్ని రకాలుగా దూసుకెళ్తున్నారు రాఘవ లారెన్స్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అధికారమ్’. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. డైరెక్టర్ వెట్రిమారన్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తుండగా, దురై సెంథిల్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ రక్తంతో తడిసిన దుస్తువులతో కనిపిస్తున్నాడు. లారెన్స్ లుక్స్ చూస్తుంటే సినిమా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ‘గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ’ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. కదిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: