హీట్ పెంచుతున్న మా ఎన్నికలు

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో మా ఎన్నికలు రసవత్తర పోరును తలపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న ఈ ఎన్నికల్లో హమా హేమీలు రంగంలోకి దిగుతున్నారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమా వంటి ప్రముఖ నటులు పోటీకిలోకి దిగునున్నారు. ఇక అనూహ్యంగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పేరు తెరపైకి వచ్చినా నేను పోటీలో లేనంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పటికే రేగిన మా ఎన్నికల వేడికి మరింత మంటను రాజేస్తున్నారు టాలీవుడ్ వెండితెర నటులు.

ఇక ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటూ కొందరు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు . ఇటీవల కరాటే కళ్యాణి మాట్లాడుతూ..నాన్ లోకల్ వ్యక్తులు మా అధ్యక్ష పదవికి ఎలా పోటీకి దిగుతారంటూ ప్రశ్నించింది. ఇక దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశంలో స్పందిస్తూ..అవార్డులు వచ్చినప్పుడు, గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ వ్యక్తులు గుర్తుకు రాలేదా అంటూ ఆవేదనతో ప్రశ్నించారు.

ఇలా వాదోప వాదనలు రాజుకుంటున్న క్రమంలో ఇంకా ఎలాంటి వివాదాలను తెరపైకి తేస్తారోనని సీనియర్ నటులు తమ మదిలో అనుకుంటున్నారట. దీంతో ఒ కరకంగా ప్రకాశ్ రాజ్‌కు మెగాఫ్యామిలీ నుంచి పూర్తిగా మద్దతు లభిస్తుందంటూ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే మా ఎన్నికలకు రాజకీయ రంగు కూడా పులుముకోనున్నట్లు తెలుస్తోంది.

మంచు విష్ణు కుంటుంబానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వర్గం నటుల మద్దతు ఉంటుందని తెలుస్తోంది. వైఎస్ జగన్‌కు, మంచు విష్ణు ఫ్యామిలీకి స్నేహపూరిత వాతావరణం ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రకాశ్ రాజ్ 27 మందితో కూడిన తన ప్యానెల్‌ లీస్టును కూడా విడుదల చేసి మా అధ్యక్ష ఎన్నికల పోటీలో దూకుడు పెంచుతున్నాడు. ఇక రసవత్తరంగా సాగుతున్న మా ఎన్నికల పోరుకి ఇంకెంత మంది పోటీ చేస్తారో చూడాలి మరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: