మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పిన ధనుష్.?

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ నటుడు ధనుష్ వరుస సినిమాలతో జోరును పెంచుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తు బంపర్ హిట్‌లను అందుకుంటున్నాడు. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని నిర్మాత రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయబోయే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక విషయానికొస్తే ధనుష్‌ శేఖర్ కమ్ములతో చేయబోయే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఈ లోపు ధనుష్ మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లోని ఓ బడా నిర్మాత, యంగ్ డైరెక్టర్ కు ధనుష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: