బాలీవుడ్ బాద్ షాతో లేడీ సూపర్ స్టార్?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్..గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ ఓ తమిళ యంగ్ డైరెక్టర్ తో ఓ సినిమా చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి కెమెరాకు దూరంగా షారుఖ్ ఈ సారి తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమాను చేయనున్నాడని తెలుస్తోంది.

ఇక ఇందులో ఈయనకు జోడిగా లేడి సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేసినట్లు సమాచారం. మూడు పదుల వయస్సు దాటిన చెక్కుచెదరని అందంతో వరుస ఆఫర్లను అందుకుంటూ యంగ్ హీరోయిన్ లకు సవాల్ విసురుతోందీ భామా. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఈ చిత్రంలో నయనతార నటిస్తుందన్న వార్తలో నిజమెంతో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: