డెల్టా ప్లస్ పై ఆందోళన అవసరం లేదు-ఆళ్ల నాని

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో డెల్టా ప్లస్ కేసులపై స్పందించారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. రాష్ట్రంలో డెల్టా ప్లస్ యాక్టివ్ కేసులు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా రోజు వారిగా లక్ష వరకు పరీక్షలు చేస్తున్నామని అందులో 5 వేల కేసుల వరకు నమోదవుతున్నాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ పట్ల అంతా సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఇక కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయని, రాష్ట్రంలో కర్ఫ్యూ వంటి అంశాలపై సీఎం జగన్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు మంత్రి ఆళ్ల నాని

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: