కేటాయించిన నీటినే తీసుకుంటున్నాం-పేర్ని

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదాలకు తెర తీస్తున్న అంశంపై స్పందించారు ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని తెలిపారు.

ఇక ఏపీకి కేటాయించిన నీటి కంటే ఒక్క చుక్క ఎక్కువ తీసుకోవట్లేదని అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు రాజకీయ అవసరాల కోసమే వాదనకు దిగుతున్నారని అన్నారు మంత్రి. గతంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి పంపకాల విషయంలో చాలా మేలు చేశారని తెలిపారు మంత్రి పేర్ని నాని.

Share.

Comments are closed.

%d bloggers like this: