కాలినడకన చరణ్ ను కలిసిన అభిమానులు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ నటులకు అభిమానులు కొదవ లేరనే చెప్పాలి. వారి అభిమానం కట్టలు తెంచుకుంటే ఎంతటికైనా వెళ్తారు. ఎల్లలు దాటిన అభిమానం వాళ్ల సొంతం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కలిసిందుకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అభిమానులు కాలినడకన చేరుకుని కలిశారు.

ఏకంగా నాలుగు రోజుల పాటు సాగిన వీరి నడకలో 231 కిలోమీటర్లు నడిచి వారి అభిమానాన్ని చాటుకున్నారు. వీరిలో సంధ్య రాజ్,రవి, వీరేష్ లు ఉన్నారు. రామ్ చరణ్ వీరిని ప్రేమ పూర్వకంగా స్వాగతించి కౌగిలించుకున్నారు. అనంతరం కాసేపు వారితో మాట్లాడారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: