సీఎంతో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలతో భేటీ ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లాకప్ డెత్ లో మరిణించిన మరియమ్మ విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. దీంతో పాటు రాష్ట్రంలో దిళిత, గిరిజనులపై జరుగుతున్న దాడుల అంశంపై కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం విశేషం. ఈ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: