నేడు సీఎం అధ్యక్షతన అఖిలపక్ష నేతల భేటీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సాధికారిత పథకంపై విధి, విధానాలు చర్చించేందుకు సీఎం అధ్యక్షతన నేడు అఖిలపక్షం భేటీ కానుంది. ఇందులో ఈ అంశంపై సీఎం కేసీఆర్ అఖిల పక్ష నేతలతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలకు ఆహ్వానం రాకపోవటం పట్ల తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

ఇక బీజేపీ నేతలు మాత్రం ఈ భేటీని బహిష్కరించారు. రాష్ట్రంలో దళితులను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారని, రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ భేటీ కొనసాగుతోందని తెలిపారు బీజేపీ నేతలు. ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: