రేవంత్‌ రెడ్డికి మద్దతుగా ఆర్జీవీ ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రేవంత్‌ రెడ్డికి మద్దతుగా ట్విట్టర్‌లో స్పందించాడు. టీపీసీసీగా ఎంపికైన రేవంత్ రెడ్డికి తనదైన రీతిలో స్పందిస్తూ సంచలనమైన ట్వీట్ చేశాడు. ‘ఫైనల్‌గా సింహంలాంటి రేవంత్ ని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులకు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు ఈ సింహాన్ని (రేవంత్ రెడ్డి) చూసి పులులన్నీ భయపడిపోతాయి అంటూ ట్వీట్ చేశారు.

దీంతో రేవంత్ రెడ్డి అభిమానుల నుంచి అదిరిపోయ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడు వివాదాలు చుట్టు తిరిగే రాంగోపాల్ వర్మ సమకాలీన సమస్యలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా రేవంత్ రెడ్డికి మద్దతుగా ట్వీట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: