ఓల్డ్ మాస్ టైటిల్ తో చిరు?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ పై ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమా టైటిల్ ను వీరయ్య గా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

పక్కా ఓల్డ్ మాస్ టైటిల్ తో మన ముందుకు వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మాత్రం తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తూ దూకుడు మీదున్నాడు మెగాస్టార్. మరి ఈ సినిమా టైటిల్ లో మార్పు ఏమైనా ఉంటుందా లేక ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: