తిరిగి హస్తం గూటికి కొండా?

Google+ Pinterest LinkedIn Tumblr +

చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పార్టీలో నాయకత్వ లోపం ఉందంటూ వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి హస్తం గూటికి చేరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి కొందరు సీనియర్ రాజకీయ నేతలతో తెర వెనుక మంతనాలు జరిపారు.

టీఆర్ఎస్ కు ప్రత్యర్థులుగా ఉన్న కొందరు సీనియర్ నేతలతో కలిసి పార్టీని సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు ఓ రకంగా వార్తలు కూడా వచ్చాయి. ఇక ఉన్నట్టుండి మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటూ వార్తలు ఊపందుకోవటం చర్చినీయాంశంగా మారింది. టీపీసీసీగా రేవంత్ రెడ్డి ఎంపికైన క్రమంలో పార్టీకి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చే దిశగా పార్టీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకు ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: