సమీష్టి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టే బాధ్య‌త మనదే-సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుక‌బ‌డిన షెడ్యూల్డ్ కూలాల బాధ‌లు పోవాలని అన్నారు సీఎం కేసీఆర్. ఎస్సీల అభివృద్ధి కోసం ద‌శ‌ల‌వారీగా కార్యాచ‌ర‌ణ అమ‌లుకు సర్కార్ సిద్దంగా ఉందని తెలిపారు. నేడు దళిత సాధికారిత పథకంపై విధి, విధానాలు చర్చించేందుకు సీఎం అధ్యక్షతన నేడు అఖిలపక్షం భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం నలుమూలల ఎక్కడా చూసుకున్నా ఎస్సీలే పీడిత వర్గాలుగా ఉన్నారని, వారి అభ్యున్నతి కోసం ప్రణాళికలు దశల వారీగా రూపొందించేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపాలంటే ఏం చేయాలో సూచించాలన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా స‌మిష్టి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టే బాధ్య‌త మనమంతా తీసుకుందామ‌ని తెలిపారు. దీని కోసం నిధుల బాధ్యత నాదేనని తెలిపారు సీఎం. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: