కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజుల నుంచి టీపీసీసీ రేసులో ఉన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు . ఇక ఎట్టకేలకు పీసీసీగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. దీంతో ఆశాల్లో ఊరేగిన కోమటి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ ఎంపిక అనేది ఓటుకు నోటులా తయారైందని అన్నారు. ఇక నుంచి గాంధీభవన్ మెట్లు ఎక్కనని, టీపీసీసీ పదవిని అమ్ముకున్నారని, ఆధారాలతో సహా భయటపెడతానని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని అయినా మాకు న్యాయం చేయలేదని తెలిపారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: