కోమటి రెడ్డి బ్రదర్స్ దారెటు?

Google+ Pinterest LinkedIn Tumblr +

టీపీసీసీ ఎంపిక అమ్మకున్నారని, ఆధారాలతో సహా బయట పెడతానంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి. తాజాగా కోమటి రెడ్డి సైతం కాంగ్రెస్ అధిష్ఠానంపై బాణాలు విసురుతుంటే కోమటి రెడ్డి బ్రదర్స్ కొత్త దారి వెతుక్కుంటారేమోనని తెలుస్తోంది.

రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ బీజేపీకి వత్తాసు పలుకుతున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ ఇప్పుడు ఒకే పాట పాడుతుండటంతో పార్టీ మారతారేమోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక వీరిద్దరి పయనం ఎటు వైపో అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: