రాజీనామా దిశగా మర్రి శశిధర్ రెడ్డి?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ పీసీసీ ప్రకటన వెలువడి రోజు కూడా కాకముందుకే పార్టీలో అప్పుడే ముసలం రాజుకుంటూ మంటలు రేపుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత కేఎల్లార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పీసీసీ రేసులో పేరు వినిపించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా గాంధీ భవన్ మెట్లు ఎక్కనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగానే కాంగ్రెస్ పార్టీ సీనియన్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులతో చర్చలు జరుపుతున్న ఆయన త్వరలో పార్టీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. ఇదే గనుక నిజమైతే పార్టీకి తీవ్ర నష్ఠం వాటిల్లుతోందని మేదావి వర్గాల వాదన. ఇక పార్టీలోని నేతలు ఇంకా ఎవరెవరు రాజీనామా చేస్తారో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: