ఈటలను విమర్శించే స్థాయి నీది కాదు-టీ.ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఈటలను విమర్శిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు. సోమాజిగూ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..బాల్క సుమన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన ఈటల రాజేందర్ ను విమర్శించే స్థాయి నీది కాదంటూ బాల్క సుమన్ పై విరుచుకుపడ్డారు. ఇక పార్టీ నుంచి ఈటలను ఉద్దేశపూర్వకంగానే బయటకు పంపారన్నారు. ఇక రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికుట్రలు చేసినా, ఏకంగా సీఎం వంద కోట్లు ఖర్చు చేసినా గెలుపు మాత్రం ఈటలదే అని ధీమా వ్యక్తం చేశారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: