ఇక ఆయనను పిలిచేది ఆ పేరుతోనే-బండ్ల గణేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

అభిమానానికి హద్దులు ఉంటాయనే ఈ పదాన్ని వినటానికి, చదవటానికి మాత్రమే సరిపోతోంది. ఒక అభిమాన హీరోని అభిమానించటం వేరు, కీర్తించటం వేరు. ఇక సాధారణ ప్రేక్షకుడు తనకు నచ్చిన రీతిలో తనకు నచ్చిన విధంగా తన ప్రేమను తెలియజేస్తుంటాడు. కానీ చిత్ర పరిశ్రమలో వీటికి భిన్నంగా తీర్పునిస్తూ ఉంటాడు స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.

టాలీవుడ్ లో నటుడిగానూ, నిర్మతగానూ వ్యవహరిస్తూ తన రూటే సపరేటు అనేలా దూసుకెళుతున్నాడు ఈయన. ఇక పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. పవన్ ఆడియో ఫంక్షన్ లో కానీ, మెగా ఫ్యామిలీ ఏ కార్యక్రమంలోనైనా బండ్ల గణేష్ అడుగు పడిందంటే చాలు.. అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊగిపోతుంటారు.

ఇక స్టేజీ ఎక్కి పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడాడా..ఇక కవిత్వాల రూపంలో ఆయనపై ప్రేమ చూపిస్తుంటాడు. ఇక గతంలో ఎన్నో సార్లు పవన్ ని దేవుడిలా పోలుస్తూ ఆయనపై ఉన్న ప్రేమను ఒలకబోశాడు. ఇక ఇదంతా బాగానే ఉన్నా..ఓ సరికొత్త టాపిక్ ను తెర మీదకు తీసుకొచ్చాడు బండ్ల గణేష్. ఈ సారి ఏకంగా పవన్ కు ఓ పేరు పెట్టి ఆ పేరుతోనే పిలుస్తానంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

నా దేవరతో నేను.. భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారని, నేను కూడా ఈరోజు నుంచి నా బాస్‌ని దేవర అని పిలుస్తాను’ అంటూ బండ్ల గణేష్ ఓ పోస్ట్ చేసి ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక ఇదే అంశం టాలీవుడ్ వర్గాల్లో తవ్ర చర్చ జరుగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: