బ్రహ్మణ అమ్మాయిని.. కోలుకోవాలని ఆశిస్తున్నా-పూనమ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా క్రిటిక్, ప్రముఖ నటుడు కత్తి మహేష్, సినీ నటి పూనమ్ కౌర్..వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందనేది టాలీవుడ్ ఎరిగిన సత్యం. గతంలో పవన్ కళ్యాణ్ పై చేసిన ట్విట్లతో చాలా ఫేమస్ అయి, వివాదాలతో ముందు వరుసలో ఉన్నారు పూనమ్ కౌర్. ఒక్కప్పుడు సినిమాల్లో రాణించిన పూనమ్ ఈ మధ్య ఎక్కువగా వినిపించటం లేదు. ఇక తాజాగా ఓ సెటైర్ తో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ భామ.

సినిమా క్రిటిక్ కత్తి మహేష్ రెండు రోజుల క్రితం కారు ప్రమాదంలో గాయపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ప్రాణాలతో బయట పడ్డ కత్తి మహేష్ ను పవన్ ఫ్యాన్స్ సైతం కోలుకోవాలని ప్రార్ధిస్తుండం విశేషం. తాజాగా పూనమ్ కౌర్ కూడా తనదైన శైలీలో చురకలు అంటిస్తూనే కత్తి మహేష్ కోలుకోవాలని తెలిపింది.

ఇక ట్విట్టర్ లో స్పందిస్తూ..రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఈ ట్విట్ మాత్రం ఖచ్చితంగా కత్తి మహేష్ గురించే అని అందరూ అనుకుంటున్నారు. మరి పూనమ్ కౌర్ ఏం వీటికి ఏం సమధానం చెబుతుందో చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: