కేయూలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తాం-సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ సర్కార్. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన పీవీ నేడు నెక్లస్ రోడ్డులో కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులు ఆర్పించారు సీఎం. అనంతరం ఆయన మట్లాడుతూ..దేశానికి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి ఆదర్శమని అన్నారు. ఇక భూ సంస్కరణలు, గురుకులాలు వంటి వాటిని తీసుకొచ్చిన ఘనత పీవీ దేనని కొనియాడారు. ఇక రానున్న రోజుల్లో కేయూ యూనిర్సిటీలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ తెలిపారు సీఎం.

Share.

Comments are closed.

%d bloggers like this: