ట్విట్టర్ వేదికగా పీవీకి నివాళులర్పించిన మంత్రి హరీష్‌ రావు

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు ట్విట్టర్ వేదికగా నివాళులు ఆర్పించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పి వి నరసింహా రావు గారు. ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే అని ట్విట్టర్ తెలిపారు హరీష్‌రావు. ఇక తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. నెక్లస్ రోడ్డులో పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్.

Share.

Comments are closed.

%d bloggers like this: