మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం-మంత్రి అనిల్

Google+ Pinterest LinkedIn Tumblr +

నీటి ప్రాజెక్టుల అంశంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఖరి కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రమైన మాటలతో దూషిస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డిపై మీరు దూషించే మాటలకు తెలంగాణ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామని, రాష్ట్ర హక్కుగా రావాల్సిన నీటినే వాడుకుంటున్నామని అనిల్ స్పష్టం చేశారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: