జులై 1 నుంచే ఆన్ లైన్ తరగతులు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ విద్యాశాఖ జులై 1 నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో నేడు క్లారిటీ ఇస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేసింది. జులై 1 నుంచి కేజీ టూ పీజీ వరకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఇక దీంతో పాటు ముందుస్తుగా ప్రకటించిన తేదీల ప్రకారమే డిగ్రీ, బీటెక్ వంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

ఇక సెట్ పరీక్షలైన ఎంసెట్, ఐసెట్ వంటి పరీక్షల్లోనూ ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గతంలో ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని అనుకున్నారు. దీంతో పరిస్థితులు అనుకూలించకపోవటం, తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావటం వంటి కారణాలతో ఆన్ లైన్ తరగతులకు మొగ్గు చూపుతోంది విద్యాశాఖ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: