ఇక నుంచి ప్రజలతోనే-కోమటి రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ పీసీసీ రేసులో ఆశగా ఉండి నిరాశతో వెనుదిరిగిన వ్యక్తి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. దీంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఇక నుంచి గాంధీభవన్ మెట్లు ఎక్కనని, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ వెనకాడబోదంటూ కూడా తెలిపింది. ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజల సమస్యలపై పోరాడతానన్నారు కోమటి రెడ్డి. భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాల పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: