ఉచిత విద్యుత్ పై హామీ ఇచ్చిన ఢిల్లీ సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విధమైన వ్యాఖ్యలు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు. ఢిల్లీలో 200 యూనిట్ల వరకూ విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామని, మహిళలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

పెరుగుతున్న ధరలతో పంజాబ్‌లోని మహిళలు సంతోషంగా లేరని, మేము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ట్విట్టర్‌లో తెలిపారు. ఇక రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే తెర వెనక మంతనాలు జరుపుతున్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: