బిగ్ బాస్ హోస్ట్ గా రానా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్..ఈ షో తెలుగు బుల్లితెరపై చేసే అల్లరి అంతా ఇంతా కాదనే చెప్పాలి. సీజన్ మొదలైందా…ఇక ప్రేక్షకులు తల దింపకుండా, కనురెప్ప వాల్చకుండా మరీ చూస్తారు. ఈ షోలో కంటెంస్టెంట్స్ చేసే చిలిపి పనులు, లవ్ ట్రాక్స్ వంటివి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకోవటంతో బిగ్ బాస్ ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది.

ఇక ఇప్పటికే ఘనంగా నాలుగు సీజన్ లను పూర్తి చేసుకుని త్వరలో ఐదో సీజన్ కు రెడీ అవుతోంది బిగ్ బాస్. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా సీజన్-5కి హోస్ట్ ఎవరనే ప్రశ్నే ఇప్పడు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. గత నాలుగు సీజన్ లలో ఎన్టీఆర్, నానీ, నాగార్జున వంటి ప్రముఖ నటులు వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక సీజన్-5కి హోస్ట్ గా ఈ సారి రానా మెరవనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆయనతో బిగ్ బాస్ టీం సంప్రదించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సీజన్ 3, 4 లలో హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున ఈ సారి కూడా ఆయనే ఉంటున్నారన్న వార్తలు సైతం లేకపోలేదు. కానీ నాగ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సారి వ్యాఖ్యాతగా చేయలేక పోతుండటంతో రానాను ఎంపిక చేసుకున్నారట బిగ్ బాస్ యూనిట్. మరి ఈ వార్తలో నిజంగానే వాస్తవం ఉందా.. లేక మళ్లీ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాక తప్పేలా లేదు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: