పీసీసీ ప్రకటన..రచ్చకెక్కిన రాజకీయం

Google+ Pinterest LinkedIn Tumblr +

పీసీసీ పదవి ఎంపిక ప్రక్రియతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రచ్చకెక్కాయనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇవ్వటం కొందరికి ఇష్టం లేదనే స్పష్ఠమవుతోంది. బాహిరంగంగా పెదవి విప్పకపోయినా లోలోపల మింగుడు పడని పరిస్థితి కనపడుతోంది.

ఇక మొత్తానికి పీసీసీ ప్రసిడెంట్‌ గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ దెబ్బతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో పీసీసీ రేసులో ఉన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో ఒక్కసారిగా ఊగిపోయిన కోమటి రెడ్డి గాంధీ భవన్ మెట్లు ఎక్కనంటూ బాహాటంగా అనేశారు.

దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేఎల్లార్, మర్రి శశిధర్ రెడ్డి వంటి కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పటం పార్టీకి భారీ నష్టమనే చెప్పాలి. మొత్తానికి పీసీసీ ప్రకంపనలతో టీ.కాంగ్రెస్ రాజకీయాలు రచ్చకెక్కాయని తేలిపోతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో రాను రాను ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చూడాలి మరి

Share.

Comments are closed.

%d bloggers like this: